అనర్హత పేరుతో పింఛన్ల తొలగింపు అన్యాయం, రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం - నల్లబోతుల నాగరాజు
రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను అనర్హత పేరుతో తొలగించడం అన్యాయమని పింఛన్లను కొనసాగించేంతవరకు రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు హెచ్చరించారు
బుధవారం ఈ సందర్భంగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నర సంవత్సరాలుగా పింఛన్ పొందుతున్న వారి అర్హత కనపడలేదా అని ప్రశ్నించారు. ఈ మూడున్నర సంవత్సరాలుగా పింఛన్లు తీసుకుంటున్న వారు ఒక నెలలోనే కోటేశ్వర్లు అయ్యారా మీరు పెంచిన 250 రూపాయల కోసం ఈరోజు దాదాపు 6 లక్షల మంది పింఛన్లు పొందడానికి అనర్హులుగా చూపడం బాధాకరమన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో పింఛన్లు పొందే అర్హత గల ప్రతి ఒక్కరికి మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు కొనసాగించాలని తొలగిస్తే వారితో కలిసి ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Comments