top of page
Writer's picturePRASANNA ANDHRA

రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కు నిలయంగా మార్చిన వైసిపి ప్రభుత్వం - నల్లబోతుల నాగరాజు

రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కు నిలయంగా మార్చిన వైసిపి ప్రభుత్వం - రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు

దేశానికే అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ కు నిలయంగా మార్చిందని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, పూర్వం దేశం మొత్తానికే బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ నేడు జగన్ రెడ్డి పాలనలో దేశం మొత్తానికి గంజాయి డ్రగ్స్ కు నిలయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాదిలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో అత్యధికంగా డ్రగ్స్ పట్టుబడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. ఏపీలో 18267 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సిఆర్పిఎఫ్ వెల్లడించిందని, 1057 కేజీల గంజాయి, 97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయని విమర్శించారు.

టిడిపి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ప్రథమ స్థానంలో ఉండగా, నేడు గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఏపీ నిలిచిందని విమర్శించారు. అధికార పక్షం నాయకులు తమ అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియాలను పెంచి పోషిస్తూ జాతిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగం ఉపాధి లేని నిరుద్యోగులు భవిష్యత్తుపై నిరాశాన్ని స్పృహలకు లోనై మత్తు పదార్థాలకు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో 15 వేల ఎకరాల్లో వైసిపి నేతల ఆధ్వర్యంలో గంజాయి సాగుతోందని ఆరోపించారు. దేశంలోని పలు రాష్ట్రాలలో పట్టుబడిన గంజాయి డ్రగ్స్ ఏపీ నుంచే సరఫరా అవుతోందని అక్కడి పోలీసులు గుర్తించడమే నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో పోలీసులు టిడిపి నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడానికి ఉపయోగించుకుంటున్నారని, శాంతిభద్రతల పరిరక్షణకు కాదన్నారు. టిడిపి పాలనలో గంజాయి అనే పదమే వినిపించకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటే, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ నకిలీ మద్యం మాఫియాలకు అడ్డగా మార్చి ప్రజల్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యదర్శి యమ్మనూరు ఆంజనేయులు, ప్రొద్దుటూరు తెలుగు యువత కార్యదర్శి పల్ల సాయిరాం పాల్గొన్నారు.

28 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page