తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి
నల్లబొతుల నాగరాజు.
నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ సోదరులకు సముచిత స్థానం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేయటం జరిగిందన్నారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను అందించటం జరిగిందని అదే విధంగా ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి ఆధునిక పనిముట్లను అందించటం జరిగిందని అన్నారు.
నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో సముచిత స్థానం కల్పించటం మరియు వారి వృత్తి పరమైన షాపులకు 150 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించటం జరిగిందని యాదవుల అభ్యున్నతికి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది అని వారి గొర్రెలకు టీడీపి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా ఇన్సూరెన్స్ చేయటం జరిగిందన్నారు .అదే విధంగా వృత్తి పరంగా బిసి యువకులు వాహన కొనుగోలుకు అవసరమైన రుణాలకు 25% సబ్సిడీ అందించటం జరిగిందని ఎం.ఎస్.ఎం.ఈ పథకం ద్వారా చిన్న పరిశ్రమలకు సబ్సిడీతో కూడిన ప్రోత్సహం అందించి యువతకు ఉపాధి కల్పించటం జరిగిందని చెప్పారు.
మత్స్యకారులకు సబ్సిడీలో ట్రాలీ ఆటోలను అందించామని నాడు టీడీపి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ కు 1143 కోట్లు కేటాయించటం జరిగిందని బీసీ కుటుంబాల్లోని పేద విద్యార్థులు ఇతర దేశాల్లో విద్యను అభ్యసించటానికి విదేశీ విద్య పథకం ద్వారా 10 నుంచి 15 లక్షలు మంజూరు చేయటం జరిగిందని తెలిపారు.స్థానిక కళాశాలల్లో చదివే బీసీ విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందించటం జరిగిందని నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో బీసీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయటం జరిగిందని గుర్తు చేశారు.
అదే విధంగా నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రాజకీయంగా బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ మంత్రి వర్గంలో 8 మంది బీసీలకు స్థానం కల్పించటం చట్టసభలలో స్థానం కల్పించి బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకుంది అన్నారు. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచిందన్నారు.బీసీ కార్పొరేషన్ల పేరుతో బీసీలను నయవంచన చేసి ఇప్పటి వరకు బీసీలకు ఒక కార్పొరేషన్ ద్వారా ఒక్క సబ్సిడీ లోను కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ఎన్నికల హామీల్లో మాత్రం బీసీలకు పెద్దపీట వేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిన ఒక్క బీసీకి కూడా న్యాయం చేయలేదని అన్నారు.నేడు బీసీ సోదరులు మాత్రం వైసీపీ మాటలు విని మోసపోయామని గుర్తించారని అన్నారు. మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే బీసీల అభ్యున్నతి సాధ్యం అవుతుంది అని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వములోని తెలుగుదేశం అధికారంలోకి రావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని బీసీల సంక్షేమం జరగాలంటే ప్రజలంతా తెలుగుదేశానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
Comments