చిన్న వర్షం కురిస్తే రోడ్లు జలమయం
... రోడ్డు దాటాలంటే కాళ్ళు తదవాల్సిందే.
.. రోడ్లన్నీ వర్షం నీటితో కాలువగా దర్శనం.
.. పాదచారులు దారిలేక అగచాట్లు.
...ఇది మేజర్ పంచాయతీ లో తీరు..
నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో చిన్న వర్షం కురిస్తే చాలు రోడ్లు అన్ని జలమయం కలువాలగా కనపడడం మామూలుగా మారిపోయింది. ప్రజలు ఇంట్లో నుండి బయటకు రవాలంటే కాళ్ళు తడవాల్సిందే అన్న రీతిలో తయారైంది. పేరుకు మాత్రమే మేజర్ పంచాయతీ సమస్యలు ఒకటి కూడా పట్టించుకొనే వారు లేరని స్థానికులు అంటున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న చిన్న వర్షం కే ఇలా ఉంటే భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఏమిటి అని వారు విమర్శిస్తున్నారు. రోడ్ల పై ఎక్కడి నీళ్ళు అక్కడే నిలబడి ఉన్న మా పరిధి కాదులే అన్నట్టుగా పంచాయతీ అధికారులు, నాయకులు చూసి చూడనట్లు తమ వాహనాలలో వెళ్తూ ఉంటారు. ఏదైనా సమస్య వారి దృష్టికి తీసుకుని పోయిన నిధులు లేవు అని చెప్పి తప్పించుకొని పోవడం మామూలు అయి పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పంచాయతీ ప్రజలు ఇచ్చిన అర్జీలు బుట్ట డాఖలు అయిపోతున్నాయి తప్పా ఎ ఒకటి నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. ఎలెక్షన్ లు వస్తె చాలు వచ్చి వాగ్దానాలు చేసి పోతరు కాని అమలు మాత్రం శూన్యం అని స్థానికులు అంటున్నారు.
Comments