నందలూరు రైల్వే లోని క్రూ కంట్రోల్ తరలించ వద్దు - రాజంపేట, నందలూరు రైల్వే కేంద్రాలలో పలు రైళ్లు ఆపాలి - ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కి వినతి
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట
నందలూరు రైల్వే కేంద్రంలోని గ్రూప్ కంట్రోల్ తరలించవద్దని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది. మంగళవారం బోయినపల్లిలోని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి స్వగృహంలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి అద్వర్యంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ, జిల్లా వక్ఫ్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ అమీర్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది.
నందలూరులోని రైల్వేక్రూ కేంద్రాన్ని ఎర్రగుంట్లకు తరలించవద్దని., తద్వారా నందలూరు రైల్వే కేంద్రం నిర్మానుషంగా మారిపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే లోకో షెడ్ మూతపడడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది నష్టపోయారన్నారు. ప్రస్తుతం బ్రిటిష్ పరిపాలన నుండి నందలూరు రైల్వే కేంద్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అలాంటి రైల్వే కేంద్రంలోని క్రూ కంట్రోల్ కేంద్రాన్ని తరలించడం దారుణం అన్నారు. అలాగే కరోనా ముందు ఉన్న అన్ని రైళ్ళను నిలుపుదల చేయాలని కోరారు. నందలూరు, రాజంపేట రైల్వే స్టేషన్లో జయంతి, జనతా మెయిల్ ఎక్స్ప్రెస్, దాదర్, వెంకటాద్రి, రాయలసీమ సూపర్ ఫాస్ట్ మిగిలిన అన్ని రైళ్ల ను ఆపాలని కోరారు.
స్పందించిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెంటనే రైల్వే జనరల్ మేనేజర్ తో ఫోన్లో మాట్లాడారు. నందలూరులోని గ్రూప్ కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలించడం తగదని., ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. ఇప్పటికే నందలూరు అన్ని రకాలుగా నష్టపోయిందని, ఇలాంటి తరుణంలో చాలా కాలంగా ఉన్న క్రూ కేంద్రాన్ని తరలించడం ఎంతవరకు సబబని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష, విజ్ఞప్తి మేరకు కేంద్రాన్ని తరలించవద్దని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రితో పాటు బోర్డు చైర్మన్ ను కలుస్తామని, రైల్లు ఆపుదలకు కూడా కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందలూరు కో ఆప్షన్ సభ్యులు కలిమ్, వైకాపా నాయకులు హిమగిరి, మన్సూర్, తుమ్మల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments