నాయకులను విమర్శించడం నా అభిమతం కాదు - నంద్యాల కొండారెడ్డి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మంగళవారం మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తన పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు టిడిపి నాయకుడు నంద్యాల కొండా రెడ్డి. అయితే ఓ అనే వ్యక్తి తన ఫోటో తో కూడిన సమాచారం సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. సదరు వ్యక్తికి తాను కాల్ చేసి మాట్లాడగా పోస్ట్ తొలగించారని బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. టిడిపి లో త వునికి కాపాడుకున్నాం అని, అధిష్టానం ఆదేశాల మేరకే తాము పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నాం అన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. కొందరు సర్వే నిర్వహించి ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేరు సూచించారన్నారు. గతంలో కూడా తన తండ్రి నాయకత్వం గుర్తించి పార్టీలు టికెట్ ఖరారు చేశారని, ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచి పార్టీలకు అతీతంగా గెలిపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వునికి ఆంధ్రప్రదేశ్ లో లేనందున తన తండ్రి పార్టీ వేసినట్లు తెలిపారు. గతంలో కిందరు తన తండ్రిని వైసీపీ లోకింకుడా ఆహ్వానించారని, కానీ సున్నితంగా తిరస్కరించారని, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన జొడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి అడుగిడిన సందర్బంగా వరద ఆయనను జాతి సమైక్యత కోసం కలిసినట్లు తెలిపారు. తాము పూర్తి సెక్యులరిస్ట్ అని, టీడీపీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా బిజెపి తో పొత్తుల వొప్పందం చేసుకున్న తమ భావజాలాన్ని పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Comments