నరేష్ కు యువ పారిశ్రామికవేత్త అవార్డు.
చిట్వీల్ కి చెందిన మదినేని నరేష్ బాబు , డాక్టర్ ఏ పి జె అబ్దుల్ కలాం మెమోరియల్ ఎక్సలెన్సీ అవార్డు 2022 ను అందుకున్నారు.. ఆదివారం తిరుపతి లో సాయి రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.
విద్య, రియల్ ఎస్టేట్, సినిమా వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచ్చినందుకు నరేష్ కుమార్ కు ఈ అవార్డు దక్కింది.రిటైర్డ్ డి ఆర్ డి ఓ డైరెక్టర్, నాసా సైంటిస్ట్ డాక్టర్ యస్. వత్సల్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ యం. మమత ఐ ఐ టీ మద్రాస్ ప్రొఫెసర్ డాక్టర్ జి. అప్పారావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్, రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ డి శ్రీహరిరావు, యస్ ఆర్ కే ఆర్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం తదితరుల చేతుల మీదుగా నరేష్ అవార్డు ను అందుకున్నారు.
ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ ప్రపంచస్థాయిలో టీ సి ఎస్, లాంటి కంపెనీలే ఉండడం మనం గమనిస్తున్నాం.. దీని అధిగమించే అబ్దుల్ కలాం గారి 20 20 నిజం చేయాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇన్వెస్ట్మెంట్, రిస్కు రివార్డ్, లాంటి విషయాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. ఇలా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహన కల్పించడం వల్ల ప్రపంచ స్థాయి కంపెనీలు మన దేశంలో ఏర్పాటు చేయబడి భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా తయారవుతుందన్నారు.
Comments