అడవులు ప్రకృతి ప్రసాదించిన వరాలు, అడవుల్లో జంతువులతో పాటు పక్షులు అనేక రకాల ఫలసాయాన్ని ఇచ్చే చెట్లు ఔషధ మొక్కలు ఉన్నాయి. వీటిలో ఏవి తగ్గిన అడవులు అంతరించి వాతావరణంలో సమతుల్యత లోపించి ప్రకృతి విలయాలు, వాతావరణంలో మార్పులు సరైన వర్షాలు కురవకపోవడం విపరీతమైన ఎండలు కాయడం ఇలాంటివి సంభవిస్తున్నాయి. అడవులతో పాటు వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవుని పై ఉంది. అయితే కొందరు తమ స్వార్థం కోసం అడవుల్లో సంచరించే జంతువులను పక్షులనువేటాడి వాటి మనుగడ లేకుండానే చేస్తున్నారు. వన్యప్రాణులను పక్షులను అటవీ సంపదను కాపాడాల్సిన కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ లో ని రుద్రవరం సెక్షన్ లో తెలుగుగంగ కాలువ సమీపంలో కొందరు వేటగాళ్లు జాతీయ పక్షి నెమలిని వేటాడి చంపి వాటి మాంసాన్ని పట్టణాలకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. వేటగాళ్లు తెలివిగా తినుబండారాల కు పక్షులు సృహ తప్పి పోయే విధంగా కొన్ని ఔషధాలను పోసి అటవీ ప్రాంతంలో పడ వేస్తున్నారు. వాటిని తిన్న నెమళ్లు ఇతర పక్షులు సృహ తప్పి పడిపోగానే వేటగాళ్ళు గమనించి నెమళ్లను చంపి మాంసాన్ని తీసుకొని ఈ కలను గుట్టుచప్పుడు కాకుండా కాల్చి వేస్తున్నట్లు తెలిసింది. ఇలా నెమళ్లను వేటాడు తున్న వారిపై నిఘా లేకపోవడంతో ఇష్టానుసారంగా అడవి జంతువులను వేటాడుతున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. జంతువులు పక్షులు అంతరించి పోకముందే ఫారెస్ట్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు.
నెమళ్లు లను వేటాడుతున్న ట్లు తన దృష్టికి రాలేదు - అధికారి శ్రీపతి నాయుడు.
రుద్రవరం అటవీ రేంజ్ లోని రుద్రవరం సమీపంలో నెమళ్లను వేటాడు తున్నట్లు తన దృష్టికి రాలేదన్నారు. అలాగే 5 నెమళ్లు చనిపోయినట్లు తనకు తెలియదని సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపి అన్ని కోణాలలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని రేంజ్ అధికారి తెలిపారు.
అటవీ రేంజ్ లోని రుద్రవరం సమీపంలో నెమళ్లను వేటాడు తున్నట్లు తన దృష్టికి రాలేదన్నారు. అలాగే 5 నెమళ్లు చనిపోయినట్లు తనకు తెలియదని సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపి అన్ని కోణాలలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని రేంజ్ అధికారి తెలిపారు.
Comments