సిరిపురి సిగలో మరో కలికితురాయి
వైఎస్సార్, జిల్లా, ప్రొద్దుటూరు
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జాతి ఐక్యతకు చిహ్నంగా ప్రొద్దుటూరు పట్టణంలోని శివాలయం కూడలి వద్ద ప్రత్యేకంగా వొంద అడుగుల ఎత్తులో శాశ్వతంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్నీ గురువారం ఉదయం నియోజకవర్గ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. వేలాదిగా పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థుల నడుమ ఎమ్మెల్యే రాచమల్లు దేశభక్తి గీతాన్ని ఆలపిస్తూ మువ్వన్నెల త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తున్న సమయంలో ఆయన భావోద్వేగాలకు గురి అయ్యారు, మనందరి జాతి ఒకటేనని అది 'భరత జాతి' అని పేర్కొన్నారు. కుల, మాత, జాతి వివక్షలు విడనాడి దేశాభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విదార్థులు దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థుల స్వతంత్ర సమరయోధుల వేషధారణలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం విదార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, కమిషనర్ వెంకట రమణయ్య, ఎంపీపీ శేఖర్ యాదవ్, పలు శాఖల చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, విదార్ధినీ విద్యార్థులు, నియోజకవర్గ ప్రజలు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
Comments