వ్యవస్థను మార్చే ఏకైక సాధనం ఓటు.
తాసిల్దార్ శిరీష.
వ్యవస్థను మార్చాలన్నా, సమర్థవంతమైన పాలకులను ఎంచుకోవాలన్నా ఈ ప్రజాస్వామ్యంలో ఏకైక సాధనం ఓటు అని చిట్వేలు తాసిల్దార్ శిరీష పేర్కొన్నారు. గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చిట్వేలు ఉన్నత పాఠశాల నుంచి ప్రధాన వీధులలో విద్యార్థులచే ఓటు ప్రాధాన్యతను గురించి అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే దిశగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఓటు హక్కు కల్పించిందన్నారు. అమూల్యమైన ఓటును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. ప్రాథమిక హక్కుయిన ఓటును వినియోగించుకోకుండా అభివృద్ధిని ఆకాంక్షించడం ఎప్పటికీ నెరవేరని కళ అని ఓటు వినియోగంలో ప్రతి పౌరుడు ముందుండాలని పిలుపునిచ్చారు. తదుపరి మండల పరిధిలో వయోజన ఓటర్లకు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ శేసం రాజు, ఎంఈఓ లు ఈశ్వరయ్య, కోదండ నాయుడు, హెచ్ఎం పురుషోత్తం రెడ్డి, ఎన్సిసి అధికారి రాజశేఖర్, వీఆర్వోలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments