ఎమ్మిగనూర్ లోి ఉన్న నవోదయ టాపర్ సైనిక కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని APSU ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు లో ఉన్నటువంటి టాపర్ కోచింగ్ సెంటర్లలో శిక్షణను అభ్యసిస్తున్న అటువంటి విద్యార్థులు పాఠశాల సమయంలో విద్యార్థులు పాఠశాలలో ఉండకుండా టాపర్ కోచింగ్ సెంటర్ లో ఉండడం జరుగుతుంది. విద్యార్థులు పాఠశాలకు హాజరు కాకుండా పాఠశాలల్లో హాజరు వేయడం జరుగుతుంది. అదేవిధంగా టాపర్ కోచింగ్ సెంటర్లో మౌలిక వసతులు లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులను మోసంచేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం జరుగుతుందని కోవిద్ 19 సమయం లో ప్రభుత్వ నిబంధనలు( మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ ) పాటించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా టాపర్ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఈ సమస్యపై ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో APSU నాయకులు విజయ్, లోకేష్, భీమన్న, తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.
top of page
bottom of page
Comments