(ప్రసన్న ఆంధ్ర, సందీప్, కర్నూలు ప్రతినిధి)
రచ్చుమర్రి, బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించడం హర్షణీయం: నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి సన్నెక్కి కర్రెన్న మాదిగ
నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి సన్నెక్కి కర్రెన్న మాదిగ గారు రచ్చమరి గ్రామం లో ఆయన స్వగృహంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు పై గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఈరోజు నిందితుడు శశి కృష్ణకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు వెలువరించడం అభినందనీయమని ఆయన అన్నారు.
స్వాతంత్ర దినోత్సవం రోజున పట్టపగలే అందరూ చూస్తుండగానే గతేడాది గుంటూరు పరమయ్య కుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయమే సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్య నువేధించేవాడు తన ఫోన్ నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టిందనే కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి పొడిచి హత్య చేయడం సీసీ కెమెరాలు కూడా నమోదవడం మనందరికీ తెలిసిన విషయమే, ఆమె గొంతు పై కడుపులో అనేకసార్లు పొడిచి పొడిచి చంపడం మనందరినీ ఎంతో కలచివేసిన ఘటన,రమ్య ఎస్సి కులానికి చెందిన అమ్మాయి కావడంతో అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడంతో ప్రత్యేక కోర్టులో కేసుకు సంబంధించిన తీర్పు ఈరోజు ముద్దాయి శశి కృష్ణకు ఉరిశిక్ష విధించడం చాలా అభినందనీయమని ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కోర్టులు, ప్రభుత్వాలు తొందరగనే శిక్ష పడే విధంగా చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టం కూడా ఈ కేసులో కీలకంగా ఉపయోగపడిందన్నారు. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు చేయాలంటే కూడా ప్రతి ఒక్కరూ బయపడాలని అందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
Comments