ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎన్.సి.సి విద్యార్థుల భారీ ర్యాలీ. ఆరోగ్యమే మహాభాగ్యమన్న ప్రధానోపాధ్యాయులు : కృష్ణమూర్తి
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం చిట్వేలి ఉన్నత పాఠశాల ఎన్ సి సి అధికారి పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ఘనంగా ర్యాలీ నిర్వహించి, ఆరోగ్యం పట్ల ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. ఈ ర్యాలీ నీ ప్రారంభించిన ప్రధానోపాధ్యాయులు ఏ.కృష్ణమూర్తి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు అయితేనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని" ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం" లేదని తెలిపారు.
ఎన్ సిసి అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ 30 ఆంధ్రా బెటాలియన్ ఎన్ సిసి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ దినోత్సవాన్ని ఎన్సిసి విద్యార్థులచే ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం ఇది ఒక ఇతివృత్తంలో జరుపుతామని...2022 సంవత్సరానికి గానూ " మన గ్రహం(భూమి) మన ఆరోగ్యం"అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నామని.. దీని ముఖ్య లక్ష్యం ప్రస్తుత కరోనా వ్యాప్తి రీత్యా..క్రానిక్ రోగాలైన క్యాన్సర్ ,ఆస్మా ,గుండె సంబంధిత వ్యాధుల నుండి బయటపడాలంటే మన చుట్టూ ఉన్న గాలిని,వాతావరణాన్ని,భూమిని కలుషితం కాకుండా చూసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉండగల మన్నారు. తదుపరి ఎన్ సిసి క్యాడెట్లు ఆరోగ్య సంబంధమైన నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ చిట్వేల్ హై స్కూల్ నుండి ప్రధాన వీధులలో వైఎస్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దొడ్లవాగు శ్రీనివాసులు, బాలరాజు, దుర్గరాజు, చిన్నబాబు, ఎన్సిసి సీనియర్ క్యాడెట్లు సాయి, చైత్ర, బాల మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments