ప్రొద్దుటూరులో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి - టిడిపి కార్యదర్శి కొండారెడ్డి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మెడికల్ కళాశాల ఏర్పాటుకు అన్ని అర్హతలు కలిగి ముఖ్యంగా 350 పడకలు కలిగిన జిల్లా ఆసుపత్రి ఉన్న ప్రొద్దుటూరు పట్టణాన్ని విస్మరించి నాటి వైసిపి ప్రభుత్వం మెడికల్ కళాశాలను పులివెందులలో ఏర్పాటు చేశారని, ప్రొద్దుటూరులో మెడికల్ కళాశాల ఏర్పాటు పై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పలుమార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించి ఉన్నారని రాష్ట్ర టిడిపి కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఏర్పాటుపై ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ తో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగిందని ఆయన కూడా ప్రొద్దుటూరుకు మెడికల్ కళాశాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం తరఫునుండి తగు చర్యలు తీసుకోనున్నట్లు వాగ్దానం చేశారని అయితే ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ప్రైవేట్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వంతో మాట్లాడి రాయితీలు అందేలా చూస్తామని మంత్రి సత్య కుమార్ తెలిపారన్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాల ఏర్పాటు పట్ల ఆసక్తి అవగాహన కలిగి ఆర్థిక స్థితిమంతులు ముందుకు రావచ్చునని, ఈ దిశగా ఇప్పటికే పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో చర్చించటం జరిగిందని అన్నారు.
Comments