2021-22 విద్య సంవత్సరానికి సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ ఎక్సమినేషన్ (NEET-UG) కౌన్సెలింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి.
NEET 2021 వ వుత్తీర్ణత సాధించినప్పటికీ మెడికల్, బి.డి.ఎస్, హోమియోపతి, ఆయుర్వేదం, యోగ, నాచురోపతి, యునాని తదితర ఆయుష్ కోర్సులు ప్రవేశ కౌన్సెలింగ్ జరగనందున విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వాస్తవంగా నవంబర్ లేదా డిసెంబర్ నాటికి పూర్తి కావలసిన ప్రక్రియ నేటికీ పూర్తి కాకపోవడంతో తల్లిదండ్రులు విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు, సీటు వస్తుందో రాదో తెలియక ఒకవైపు మరలా లాంగ్ టర్మ్ వైపుకు ద్రుష్టి పెట్టాలా వద్ద అనే సందేహంలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
కావున ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న NEET-2021 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించేలా నోటిఫికేషన్ విడుదల చేసి పారదర్శకంగా సీట్లు భర్తీ చేయాలి అని కోరుచున్నారు, అన్గాన్ని మార్గదర్శకాలతో డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ఓటిఫికేషన్ విడుదలకు ఏర్పాటు చేయగలరని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అలాగే 2021-22 సంబంధించిన రాష్ట్రంలో నిలిచిపోయిన లేదా మిగిలిపోయిన సీట్లను వెంటనే పూర్తి చేయాలని లేకపోతే విద్య సంవత్సరం వృధా అవుతుంది అని తల్లిదండ్రులు కోరుచున్నారు. కావున డైట్, లా, పీజీ, ఎంసెట్ (బైపీసీ), ఫీజికల్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ పండిట్స్ తదితర కోర్సులలో మిగిలిన ఖాళీలను భర్తీ చెయ్యాలి అని కోరుతున్నారు.
Comments