అమరావతి, కొత్త మంత్రుల తో ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం.
వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం ఏర్పడిన తొలి కేబినెట్, చివరి సమావేశం ఈ రోజు జరుగనుంది, కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులంతా రాజీనామాలు సమర్పించనున్నారు. ప్రమాణ స్వీకారం రోజే మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినందున ఈ మార్పుచేర్పులు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై కసరత్తు పూర్తి చేసిన సీఎం. గవర్నర్ను నిన్న కలిసి సమగ్రంగా చర్చించారు, ఈ నెల 11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు.
Comments