top of page
Writer's pictureEDITOR

స్వామీజీ పూర్ణానంద కేసులో కొత్త ట్విస్ట్‌

విశాఖ స్వామీజీ పూర్ణానంద కేసులో కొత్త ట్విస్ట్‌

విశాఖ స్వామీజీ పూర్ణానంద కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. అనూహ్యంగా సీన్లోకి వచ్చారు హిందూ పరిషత్‌ నేతలు. రావడం రావడమే సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలిపైనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బాలిక ఆరోపణల వెనుక పెద్ద కుట్రే ఉందంటున్నారు హిందూ నేతలు. ఇంతకీ, ఆ కుట్ర ఏంటి?. అసలు, ఆ బాలిక వెనుక ఎవరున్నారు?

పగలు యోగి-రాత్రి భోగి! పైకి కాషాయ వేషం-లోపల కామకేళి! స్వామీజీల ముసుగులో కొందరు చేస్తోన్న పాడు పనులివి!. విశాఖ స్వామీజీ పూర్ణానంద ఒక్కడే కాదు… ఇలాంటివాళ్లెందరో ఉన్నారు!. దొరికితే దొంగ… లేదంటే అప్పటివరకూ దొరలే!. ఇది జగమెరిగిన సత్యం!. అయితే, పూర్ణానంద విషయంలో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. పూర్ణానందపై లైంగిక ఆరోపణల వెనుక కుట్ర ఉందంటున్నారు ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. రామానంద జ్ఞానానంద ఆశ్రమ భూముల్ని కొట్టేసేందుకు కొందరు పన్నిన వ్యూహం అంటున్నారు ఆయన. గతంలో కూడా మఠం భూముల్ని కొట్టేసే ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే పూర్ణానందపై లైంగిక ఆరోపణలు చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తంచేశారు. ఎలాంటి కుట్రా లేకపోతే తమను ఆశ్రమంలోకి పోలీసులు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తున్నారు శ్రీనివాసానంద సరస్వతి.

రామానంద జ్ఞానానంద ఆశ్రమానికి 6 ఎకరాలకు పైగా స్థలముంది. ఇదిప్పుడు కోట్ల రూపాయలు పలుకుతోంది. ఈ ఆస్తులపై కొన్నేళ్లుగా వివాదం కూడా నడుస్తోంది. అయితే, 2012లో పూర్ణానందపై రేప్‌ కేసు నమోదుకావడంతో ఆశ్రమం అనేకమార్లు వివాదాస్పదమైంది. ఇప్పుడు ఓ బాలిక ఆశ్రమం నుంచి పారిపోవడం, ఆ తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు హిందూ, బీజేపీ నేతలు.

రామానంద జ్ఞానానంద ఆశ్రమం భూముల విలువ వెయ్యి కోట్ల రూపాయలపైనే ఉందంటున్నారు ఏపీ సాధు పరిషత్‌. ఆ భూముల్ని కొట్టేయడానికీ ఈ తప్పుడు కేసులనేది ఆరోపణ. ఆశ్రమ పరిరక్షణ బాధ్యతల్ని తీసుకోవడానికి రెడీ అవుతోన్న ఏపీ సాధు పరిషత్‌, పొలిటికల్‌ లీడర్స్‌ టార్గెట్‌గా సంచలన ఆరోపణలే చేస్తోంది. అయితే, స్వామీజీ లైంగిక వేధింపులపై ప్రాథమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. మరి, పూర్ణానంద కేసులో నిజంగానే కుట్ర ఉందా?. ఆశ్రమ భూముల్ని కొట్టేసే ప్రయత్నం జరుగుతోందా?. ఎవరి ఆరోపణల్లో నిజముంది? ఇది తేల్చాల్సింది మాత్రం పోలీసులే.


39 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page