ఆసానీ తుఫాను మెళ్లగా చీరాల - బాపట్ల వైపుగా తీరం తాకనుంది. దీని వల్ల ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని పలు భాగాల్లో మరో పది గంటల దాక విపరీతమైన వర్షాలు పడే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ప్రకాశం, బాపట్ల జిల్లాల మీదుగా గాలుల వేగం గంటకు 120 కి.మీ. తాకనుంది. దీని వల్ల కొన్ని చోట్ల వరద వచ్చే ప్రమాదం కూడ ఉంది. తుఫాను దిశ అసలు మారదు, ఇక నేరుగా చీరాల-బాపట్ల వైపు పయణమౌతోంది. నెల్లూరు, కృష్ణా, విజయవాడ, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు మరో పది గంటల్లో నమోదవ్వనుంది.
ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కడప, నంధ్యాల జిల్లాల్లో ఆగి, ఆగి వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలుంటాయి. చివ్వరికీ ఈ తుఫానుకి ఒక అసలైన అంచనా దొరికింది.
Comments