రక్తదాత వేణుకు డాక్టరేట్ తో సత్కారం.
---ఈ విభాగంలో ఇప్పటివరకు ఒకే ఒక్కడుగా నిలిచిన వేణు.
---పలువురి అభినందనలు.
అది వినేందుకు చిన్న సాయం అయినా.. అత్యవసర ఆపద సమయంలో ఓ నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది అంటే అతిశయోక్తి లేదు. అట్టి సాయమే "రక్తదానం".
తన తల్లికి ఆపదలో అవసరమైన రక్తం అతనిని మరియు అతని కుటుంబ సభ్యులను రక్తదాతలుగా మార్చింది. కేవలం కొన్నిసార్లు కాదు ఎదుటివారికి ఆపదలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అత్యవసరమైనప్పుడు మరో కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకున్నా ప్రతి మూడు నెలలకు ఒకసారి తన రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ కెళ్ళి భద్రపరిచి ఎంతో మందికో ప్రత్యక్షంగాను పరోక్షంగానూ వారి ప్రాణాలు నిలబెడుతూ ఇలా సుమారు 99 సార్లు తన రక్తాన్ని ఇతరులకు పంచి ప్రభుత్వం నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి బ్లడ్ బ్యాంకు వారి నుంచి అధికారుల నుంచి ప్రజల నుంచి సాటి మిత్రులందరికీ అభినందనలు అందుకున్న దొడ్ల వాగు వేణు గోపాల్ నేడు భారత్ వర్చువల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకొని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
చిట్వేలి మండలంలో దొడ్లవాగు కుటుంబానికి పరోపకారాం అందించడంలో ప్రత్యేకత ఉన్నప్పటికీ.. సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకొని ఒకప్పటి ఎస్ సి ఎస్ ఆర్ ఎమ్ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా తన సేవలు అందించినప్పటికీ; తనకు జన్మనిచ్చిన ఊరిలోనే తన అన్న డాక్టర్ చంద్రశేఖరకు సహాయం అందిస్తూ పత్రిక విలేకరుగా తనదైన శైలిలో ముందుకెళుతూ ఇతరుల ప్రాణాన్ని నిలబెట్టడంలో అందరికీ అవసరమైన రక్తాన్ని అందించడంలో రక్తదాతగా నిలిచి చెరగని ముద్ర వేశారు.
కాగా యుఎన్ఓ మరియు నీతి అయోగ్ చే ఆమోదం పొందబడి నడపబడుతున్న "భారత్ వర్చువల్ యూనివర్సిటీ" నుంచి 99 సార్లు రక్తాన్ని దాతగా ఇచ్చి మరెందరికో స్ఫూర్తిని నిలిపిన డాక్టర్ వేణుగోపాలకు పై యూనివర్సిటీ వారు మరో డాక్టరేట్ ను అందించడంతో ఒక ఎత్తైతే; ఇంతవరకు మరెవ్వరికీ రక్తదాతలకు దక్కని అవకాశం అతనికి దక్కడంతో తన వైపు నుంచి సంతోషం వ్యక్తం కాగా; ఇతరుల వైపు నుంచి అభినందనలు ఎల్లువెత్తాయి.
డాక్టర్ వేణుగోపాల్ మాటల్లో:-- నా తల్లికి ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు అత్యవసరమైన రక్తం.. నన్ను,నా కుటుంబ సభ్యులను రక్తదాతలుగా మార్చిందని ఆనాటి నుంచి నేటి వరకు నిరంతరం దాతలుగా నిలిచామని.. తన అన్న డాక్టర్ చంద్రశేఖర్ సుమారు 40 సార్లు రక్తదాతగా వ్యవహరించారని;తన అన్నగారే తనకు స్ఫూర్తి అని; ఎన్నో మార్లు చిట్వేలి పరిసర ప్రాంతాలలో మండల అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, యువత సహాయ సహకారాలతో నిర్వహించిన బ్లడ్ క్యాంపుల్లో వందల సంఖ్యలో పలువురు దాతలుగా నిలవడం తనకు ఆనందం నింపిందని డాక్టర్ వేణుగోపాల్ పేర్కొన్నారు.
పలువురి అభినందనలు:--కాగా తాను చేపట్టిన ఈ మంచి పనికి, యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇచ్చి గౌరవించడంతో మండల అధికారులు, నాయకులు, మిత్రులు, స్వచ్ఛంద సంస్థల వారు, యువత, తోటి పాత్రికేయులు పలువురు అభినందనలు తెలిపారు.
Comments