పర్యావరణ సమతుల్యుతకు మొక్కలు నాటాలి : ఎన్ ఎస్ ఎస్ యూనిట్
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అధికారి డాక్టర్ ఎల్ రాజమోహన్ రెడ్డి సూచించారు. వారం రోజులపాటు జరిగే ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు లో భాగంగా ఎన్టీఆర్ కాలనీలోని పాఠశాల యందు మొక్కలు నాటారు. ఇంతకు మునుపు పాఠశాలలో ఉన్న మొక్కలకు పాదులు తీసి నీటిని పోశారు. ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ రెండవ యూనిట్ అధికారి వెంకట నరసయ్య మాట్లాడుతూ పర్యావరణ వ్యవస్థలో సమతుల్యాన్ని పాటించాలంటే మొక్కలు నాటాలని సూచించారు. కాలనీ నందు ప్రజలకు మొక్కల సంరక్షణ మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Comments