ఘనంగా ఎన్ టి ఆర్ శత జయంతి వేడుకలు.
సినీ నటున తో యావత్ ప్రజలకు చేరువై ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక పార్టీని ఏర్పరిచి ఊహించని విజయంతో తెలుగుదేశం పార్టీని దశదిశలా చాటి అందరి మదిలో చిరస్మరణీయుడిగా నిలిచిన యుగపురుషుడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా చిట్వేలు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి పార్టీ శ్రేణులు, మహిళలు విగ్రహానికి పూలమాలవేసి మిఠాయిలు పంచి పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు సత్యనారాయణ, యువ నాయకులు కాకర్ల నాగార్జున ఇరువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా స్థాపించబడినదని నేడు ప్రజా సంక్షేమాన్ని వదిలి ప్రజలపై అన్నిరకాల భారాలు మోపుతూ ఇబ్బంది పెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గట్టిగా సమాధానం ఇచ్చి చంద్రబాబు నాయకత్వంలో తిరిగి పార్టీ గెలుపుకు కృషి చేసినప్పుడే ఎన్టీఆర్ కి నిజమైన నివాళి అర్పించి నట్లు అని వారన్నారు.
ఈ కార్యక్రమంలో బాలు రెడ్డయ్య, వీరాంజనేయ రాజు, వెంకటేష్ రాజు, నాగరాజు, పెరుగు వెంకట సుబ్బయ్య, మద్దిన కోటేశ్వరయ్య, మహిళా కార్యకర్తలు అంజనమ్మ,లక్ష్మీ నరసమ్మ, చెంగమ్మ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments