ఉయ్యూరు లోని బాబు రాజేంద్ర ప్రసాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోనే కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేసినారు .
ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ లో అంతర్భాగంగా ఉన్నటువంటి పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకువెళ్లి ఎక్కడో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో కలపడం దారుణమని, మా పెనమలూరు నియోజకవర్గం లోని కానూరు, తాడిగడప, యనమలకుదురు, పోరంకి, పెనమలూరు,గంగూరు,వణుకూరు, గోసాల,ఈడుపుగల్లు, కంకిపాడు గ్రామాలు విజయవాడ సిటీ లోనే అంతర్భాగంగా కలిసి పోయి ఉన్నాయని , అదేవిధంగా మా ఉయ్యూరు టౌన్ మరియు మండలంలోని గ్రామాల ప్రజలకు కూడా విజయవాడ తోనే వ్యాపార, వాణిజ్య,ఆర్థిక, సామాజిక, సాంఘిక, రాజకీయ పరమైన, భావొద్వేగా పరమైన సంభంద భాంధవ్యలు కలిగి ఉన్నాయని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, ఉయ్యూరు మండల తేదేపా అధ్యక్షులు ఎనిగళ్ల కుటుంబరావు, తెదేపా సీనియర్ నాయకులు కూనప రెడ్డి వాసు, పండ్రాజు చిరంజీవి మున్సిపల్ కౌన్సిలర్లు పల్యాల శ్రీనివాస్, పరిమి భాస్కర్, బూరెల నరేష్, తెదేపా నాయకులు అబ్దుల్ నజీర్, మీసాల అప్పలనాయుడు, యలమంచిలి ప్రసాద్, సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, జంపన వీర శ్రీనివాస్, తేజ, చలపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments