వైఏస్సార్ కడప జిల్లా చిట్వేలి మండల కేంద్రంలోని ఎంపీడీవో సభాభవనం నందు ఈ రోజు సాయంత్రం స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వివిధ చట్టాల పై అవగాహన సదస్సు ను నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా రాజంపేట జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సంధ్యారాణి హాజరయ్యారు. తాను మాట్లాడుతూ... చట్టంపై అవగాహన ఉంటేనే న్యాయాన్ని పొందవచ్చని, అట్టి న్యాయాన్ని పొందే హక్కు,అధికారం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిందని; కానీ అవగాహన లోపం వల్ల అనేకమంది సమాజంలో సామాజిక,ఆర్థిక, కుటుంబ, ఋణ, వృద్ధాప్య పోషణ, మహిళా వేధింపులు, బాల్యవివాహాలు తదితర చట్టాలు ఉన్నాయనీ.. ఇలాంటి అంశాలలో కోర్టు చుట్టూ తిరుగుతూ కాలాన్ని, ధనాన్ని వృధా చేస్తున్నారని; అట్టి వారి కోసం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మార్చి 12వ తేదీన జాతీయ లోక్అదాలత్ ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని అందులో భాగంగా రాజంపేట నందు మెగా లోక్ అదాలత్ నిర్వహణ ఉంటుందని.. బాధితులు, కక్షిదారులు ఇరువురికి రాజీ అయ్యేందుకు సానుకూలత ఉన్నట్లయితే త్వరితగతిన ఆయా కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లింగ నిర్ధారణ కూడా చట్టరీత్యా నేరమని , వృద్ధులను పోషించే బాధ్యత తమ పిల్లల దేనని అట్టి విషయాలు కూడా చట్టాల్లో ఉన్నాయని తెలిపారు. షెడ్యూల్ కులాల వారు, ఆర్థికంగా వెనుకబడిన వారు తదితరులు ఎలాంటి ఖర్చు లేకుండా చట్టం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మెజిస్ట్రేట్ జీవన చంద్రశేఖర్ , స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు, మండల పరిపాలన అధికారి నాగభూషణం లు మాట్లాడుతూ చదువుతోపాటు చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ముందుగా భయాన్ని విడనాడాలని ముఖ్యంగా మహిళలు తమకు కల్పించిన సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, కార్యదర్శులు, పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళ పోలీసులు, అంగన్వాడి సిబ్బంది, వాలంటరీ లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comentarios