రోడ్డు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం - జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలోని ఓబులవారిపల్లి మండలం చిన్న వరంపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తెలిపారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయాపడిన వారికి రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియా అందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. అంతేకాకుండా.. పాక్షికంగా గాయాపడిన వారికి వైద్యం పూర్తి ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు.
కాగా.. శనివారం రాత్రి తిరుపతి వైపు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సును చెన్నై వైపు వెళుతున్న లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతి 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ఇద్దరు మృతి చెందినట్లు రాత్రి పదకొండు గంటల వరకు సమాచారం. తీవ్ర గాయాల పాలైన వారిని తిరుపతి రుయాకు తరలించగా.. పాక్షికంగా గాయాలైన వారిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సంఘటన స్థలంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేయడం జరిగింది.
Comments