ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ భారీ ర్యాలీ - పాల్గొన్న అధికారులు.
ప్రకృతి ప్రసాదించిన పర్యావరణాన్ని, మానవజాతి ప్లాస్టిక్ అనే మహమ్మారిని విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల భూమి నిర్జీవమై, నీరు కలుషితమై, జంతు జీవరాసులు సైతం వాటి ప్రాణాలను పోగొట్టుకుంటున్నాయని, అనేక రోగాలకు కారణం అవుతున్నాయని మంగళవారం ప్లాస్టిక్ నిషేధంపై ఎంపీడీవో మోహన్,ఎస్ఐ వెంకటేశ్వర్లు తో కలిసి ఉన్నత పాఠశాల విద్యార్థుల చే నిర్వహించిన ర్యాలీలో సిఐ విశ్వనాథరెడ్డి, ఎమ్మార్వో మురళీకృష్ణ లు పేర్కొన్నారు.
వారు మాట్లాడుతూ తాత్కాలిక అవసరాల కోసం మానవజాతి చేసే చిన్న తప్పిదంతో దీర్ఘకాలం పాటు వాటి విష ప్రభావం మన పైన ప్లాస్టిక్ చూపెడుతుందని, ఈ వాడకం ఇలాగే కొనసాగితే మానవజాతి మనగడ ఒక ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. ప్లాస్టిక్ నిషేధం ఎవరికి వారు స్వచ్ఛందంగా ఆలోచించి ముందుకు వచ్చినప్పుడే జరుగుతుంది తప్ప ఏ ఒక్కరి వల్ల కాదని భావితరాల కోసం ప్లాస్టిక్ నిషేధానికై మనమందరం కంకణం కట్టుకోవాలని తెలిపారు. నిర్దేశించిన గడువు లోపల వ్యాపారస్తులు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ పై దృష్టి సారించాలని,తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు డేవిడ్ ప్రసాద్, ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments