అడపుర్ పంచాయతీ ఎగువ హారిజనవాడ కాలనీ లో నీ ప్రభుత్వ భూమిని కొది రోజుల కిందట కొందరు ఆక్రమించి ఇల్లు నిర్మించుటకు పిల్లర్ లు వేసినారు.వెంటనే గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ & MRO కి వినపించగా, వెంటనే అధికార్లు గ్రామం లో విచారించి అక్రమ కట్టడాలను నిలిపి వేశారు. ఆక్రమనదారుడికి 4 దినములు సమయం ఇచ్చి తగిన పత్రములు చుపించమని కోరారు అధికారులు.10 రోజులు అవుతునపటికి వాళ్ళ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఈ రోజు మండల తహశీల్దార్ ఆదేశాల మేరకు పంచాయతీ సెక్రెటరీ & VRO కలిసి ఆ స్థలం లో ప్రభుత్వ బోర్డ్ నాటి గ్రామ అవసరాల కోసం ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం నీ కేటాయించారు. ఈ విషయం పై గ్రామస్తులు ఆనందం తో ఆ అధికారులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ప్రభుత్వ అధికార్లు ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు గురికాకుండా తమ విధులను సక్రమంగా నిర్వతిస్తే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయి అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
top of page
bottom of page
Comments