కడప, పోలీస్ శాఖ శుక్రవారం నుంచి కఠిన నిబంధనలు అమలు చేయబోతోంది ఈమేరకు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. కోవిడ్ - 19 థర్డ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ మరింత కఠినంగా కోవిడ్ నిబంధనలు అమలు చేయనుంది. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ధరించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని ఎస్.పి హెచ్చరించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ లు నిర్వహించే ఫంక్షన్ హాళ్లలో ప్రభుత్వ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చూడాలని, పరిమితికి మించి జన సమూహం చేరితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణ యజమానులు తమ షాపుల ఎదుట సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ వేయాలని, షాప్ ఎదుట తాడు కట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై డి.ఎం యాక్ట్ ( డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ) క్రింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హోటల్ నిర్వాహకులు హోటల్ లో సర్వర్ లు, ఇతర ఉద్యోగులు ఖచ్చితంగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్.పి కోరారు.
top of page
bottom of page
Comments