గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ.
గాజువాక బిసి రోడ్ జంక్షన్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాంబాబు గారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడానికి 300 రోజుల నుండి ప్రయత్నం చేస్తోందన్నారు అయినా సరే కార్మికవర్గం అంతా కూడా ఏక తాటిపై ఉండి ఇంతవరకు ప్రైవేటు వ్యక్తులు స్వరపడకుండా స్టీల్ ప్లాంట్ ని కాపాడుదాం అన్నారు అలాగే ఇప్పుడు కోటి సంతకాల సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేయాలన్నారు ఈ కోటి సంతకాల సేకరణలో గాజువాక ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు గాజువాక ఇంత అభివృద్ధి అయిందంటే కారణం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉండటమే ప్రధాన కారణమని ప్రజలకు తెలియజేశారు కావున స్టీల్ ప్లాంట్ను మనమందరము కూడా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జూన్ కార్యదర్శి డి రమణ లోకేష్ నాగేష్ పి నాగేశ్వరరావు శ్రీనివాస్ నరసింగరావు అప్పారావు మరియు సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
Comentários