ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర రిపోర్టర్ వీర
అమృత మహోత్సవం జరిపే హక్కు కేంద్రానికి లేదు
నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో దేశ ప్రజలను మోసం చేస్తోందని. దీనిని జరిపే హక్కు కేంద్రం లోని బిజెపికి లేదని ఆయన అన్నారు. కానీ నేడు ఆజాదికా సంకల్ప దివస్ తో ప్రజలు జరిపి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం కృషి జరగాలని ఆయన అన్నారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ సిఐటియు కార్యాలయం ముందు" 75 ఏళ్ల స్వాతంత్ర్యం- నేటి కర్తవ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ముఖ్య వక్తగా విచ్చేసిన బివి రాఘవులు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ భారత రాజ్యాంగానికి కాపాడుకుంటూ, అది కల్పించే హక్కులు పొందుతూ స్వేచ్ఛాయుత జీవనం గడపడం కోసమని ఆనాడు జరిగిన స్వాతంత్రోద్యమమని ఆయన అన్నారు. ఆనాడు సాధించిన స్వాతంత్రాన్ని నిలుపుకోవడం కోసం నాలుగు ప్రధాన అంశాలపై ఆనాటి మేధావులు ఆలోచనలు పదును పెట్టి ఏర్పడినదే రాజ్యాంగం అని ఆయన అన్నారు. దానిలో ప్రధానంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి, లౌకికవాదం, ఫెడరలిజం, సమానత్వం అంశాలను క్రోడీకరించి ఏర్పరచిన రాజ్యాంగం అని ఆయన వివరించారు. దీనిని అంగీకరించని బిజెపి వాటికి నీ తూట్లు పొడుస్తూ దేశంలో గరళం సృష్టిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ప్రజలకు నచ్చిన వ్యక్తిని కులమతాలకతీతంగా ఎన్నుకొని వారికి రాజ్యాధికారాన్ని ఇవ్వడమే అని ఆయన అన్నారు. కానీ నేడు మన దైనందిక జీవితంలో సైతం ప్రవేశించి మన ఆలోచనలను మారుస్తున్నారని ఆయన అన్నారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయని ప్రధానంగా ఒక్క ఉదాహరణ మీ దృష్టికి తీసుకు వస్తానని సెల్ఫోన్ వినియోగం ద్వారా మనం చూసే కార్యక్రమాలను వారు వీక్షించి తగనుగుణంగానే మనకు సూచనలు వస్తున్నాయని ఆయన వివరించారు. లౌకికవాదం అంటే మన మతాలను మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను కించపరచకుండా జీవనం కొనసాగించడమే అని ఆయన అన్నారు.
సి ఐ ఐ ఏ ప్రతినిధి నేడు బెంగళూరులో జరిగిన మత ఘర్షణలపై ఆవిడ స్పందిస్తూ దీనిని సమర్ధించలేమని దేశంలో ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని ఆమె అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మతం అన్నది వ్యక్తిగతమని ప్రపంచవ్యాప్తంగా మతోన్మాదము అత్యంత ప్రమాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరలిజం అంటే రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో తమ ప్రజలను కాపాడుకుంటూ దేశ ఐక్యతను పెంచడమే అని ఆయన అన్నారు. కానీ నేడు కేంద్రం అనేక అప్పులు చేస్తూ రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని విష ప్రచారం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. బిజెపి తన ప్రాబల్యం పెంచుకోవడంలో అవరోధంగా నిలిచిన ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడం కోసమే నేడు ఉచితాలపై విమర్శిస్తుందని ఆయన వివరించారు. గడచిన 8 సంవత్సరాలుగా 17 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ పేరుతో కార్పొరేట్లకు అందించిన విషయాన్ని ఆయన వివరించారు. అమెరికా వంటి దేశంలోనే రాష్ట్రాలు తమ సొంత నిర్ణయాలను తీసుకుంటూ దేశ గౌరవాన్ని కాపాడుతున్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. సమానత్వం లేకపోతే స్వాతంత్రానంతరం మన సమాజంలో ఏర్పడిన మార్పులను మనం సాధించుకునేవారు కాదని ఆయన వివరించారు. పూర్తి సమానత్వాన్ని సాధించుకోవడం కోసం మన సమాజం చేయవలసిన కృషిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ సమయంలో 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం మనందరం సంకల్పం చేసుకోవాలని ఆయన అన్నారు. తద్వారానే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య విలువలతో కూడిన దేశంగా గుర్తింపు సాధిస్తుందని ఆయన అన్నారు. కనుక ఆ దిశగా మనందరి సంకల్పం నెరవేరాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె అయోధ్యరామ్, వైటి దాస్, 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, రాష్ట్ర సిఐటియు నాయకులు జగ్గు నాయుడు, నగర సిఐటియు ప్రధాన కార్యదర్శి కె.ఎమ్ శ్రీనివాస్, నగర సిఐటియు ఉపాధ్యక్షులు ఎన్ రామారావు, స్టీల్ సిపిఎం పార్టీ కార్యదర్శి పి శ్రీనివాసరాజు, స్టీల్ సిఐటియు నాయకులు జి శ్రీనివాస్, యు రామస్వామి, గంగాధర్, టి వి కె రాజు, యు వెంకటేశ్వర్లు, కె వి సత్యనారాయణ, నీలకంఠం, మరిడయ్య, బి ఎన్ మధుసూదన్, వివి రమణ, కెపి సుబ్రహ్మణ్యం తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, మహిళలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comentarios