ఆర్గనైజేషన్ పేరిట మహిళలకు కుచ్చుటోపీ
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
మండల పరిధిలోని మదన గోపాలపురం లో రూరల్ కింగ్డమ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పేరిట నిర్వాహకులు మహిళలకు కుచ్చు టోపీ పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్వాహకులు రాధాకృష్ణ, పరశురాములు మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేస్తామని ప్రలోభాలు పెట్టి, మహిళలకు టైలరింగ్ నేర్పిస్తామని రూ 600 చొప్పున 120 మంది దగ్గర రూ 72 వేలు వసూలు చేసినట్లు బాదిత మహిళలు ఆరోపిస్తున్నారు.
నాలుగు నెలలు శిక్షణ ఇచ్చిన అనంతరం శిక్షణా కేంద్రంలో నాలుగు కుట్టు మిషన్లను వదిలివేసి ఇంటి అద్దె కూడా చెల్లించకుండా నిర్వాహకులు పరారైనట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. కట్టిన సొమ్ము చెల్లించాలని బాధితులు తనను వేధిస్తున్నారని కుట్టు మిషన్ లో శిక్షణ ఇచ్చిన శ్రీలేఖ ఆవేదన చెందుతున్నారు. బాధితుల ఒత్తిడి భరించలేక నిర్వాహకులకు ఫోన్ చేస్తే బెదిరిస్తున్నారని లేదా స్విచ్ ఆఫ్ చేసుకుని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని శ్రీలేఖ విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు.
Comments