వైభవోపేతంగా ఓసూరు ఎల్లమ్మ తిరుణాల.
--ఏడు గ్రామాల్లో కనువిందు చేసిన సందడి.
---మొక్కులు తీర్చుకున్న వేలాది మంది భక్తులు.
--రాజకీయ ప్రముఖుల తాకిడి.
--స్థానిక ఎస్సై పటిష్ట బందోబస్తు.
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని మైలు పల్లి పంచాయతీ మైలపల్లి గ్రామసమీపాన వెలసియున్న ఏడు గ్రామాల గ్రామ దేవత ఓసూరు ఎల్లమ్మ తిరునాళ్ల మహోత్సవం శుక్రవారం నాడు ఊరేగింపు ఎం రాచపల్లి తో మొదలు మైలపల్లి గొల్లపల్లి బట్టువారి పల్లి తదితర గ్రామాలలో ప్రతి ఇంటి గడప లోనూ అమ్మవారు రథం మీద ఊరేగుతూ భక్తులకు అభయ కటాక్షాలు నొసంగుతూ దర్శనం ఇచ్చారు. ఏడు గ్రామాలలోని గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు,యువత, స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు సహాయంతో ఎలాంటి అవాంఛనీయ ఇబ్బందులు జరగకుండా సామరస్య, సమైక్యతతో పటిష్ట చర్యలు గైకొన గా... బంధుమిత్రులతో, పిల్లాపాపలతో, భక్తిశ్రద్ధలతో ఆయా గ్రామ ప్రజలు
వైభవోపేతంగా తిరునాళ్ల మహోత్సవం జరుపుకొన్నారు. కాగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని ప్రజలు అమ్మవారి దర్శనానికి బారులు తీరి తమ మొక్కులు తీర్చుకున్నారు. పలువురు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, అన్నదానం వితరణ తదితర కార్యక్రమాలను విరివిగా నిర్వహించారు.
రాజకీయ ప్రముఖుల సందడి : ఓసూరు ఎల్లమ్మ తిరుణాలలో రాజకీయ నాయకుల సందడి జోరందుకుంది. మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్, వైసిపి కోడూరు నియోజిక వర్గ సీనియర్ నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి, మండల వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, మల్లిశెట్టి వెంకటరమణ, గిరిధర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ బాలు, కె కె వడ్డిపల్లి సుబ్బరాయుడు తదితరులు అమ్మవారిని దర్శించుకుని;... ఎం వడ్డిపల్లి గ్రామంలో పసుపులేటి క్రిష్ణయ్య , సోదరుడు పాపయ్య మరియు సుబ్రహ్మణ్యం గృహలలో వారి ఆహ్వానం మేరకు మధ్యాహ్నం విందు స్వీకరించారు.
కార్యకర్తను పలకరించి ఉద్యోగ బరోసా ఇస్తానన్న పాటూరి: తిరునాళ్లకు విచ్చేసిన మైలపల్లి పంచాయతీ రాజారెడ్డి కాలనీకి చెందిన పులి నారాయణ వికలాంగ కార్యకర్తను పాటూరి శ్రీనివాసులు రెడ్డి పలకరించి అతని కుమారుడు శ్రీనివాసులకు తన వ్యక్తిగత వ్యాపారాల నందు ఆశ్రయమిచ్చి ఉద్యోగ,ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Comments