వాహనాల స్పీడు నియంత్రించాలని శ్రీ పద్మావతి హై స్కూల్ యాజమాన్యం ఎస్సై వెంకటేశ్వర్లు కు వినతి పత్రం.
వాహనాల స్పీడు నియంత్రించడం తోనే ప్రమాదాలు నివారణ సాధ్యమని; దానికి పోలీసు వారు కఠినంగా వ్యవహరించాలని పేర్కొంటూ.. ఈరోజు ఉదయం చిట్వేలి మండల పరిధిలోని శ్రీ పద్మావతి స్కూల్ నందు చెట్లు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు కు.. స్కూల్ డైరెక్టర్ మాదినేని నరేష్ బాబు, కరస్పాండెంట్ లతా లావణ్య, స్కూల్ పిల్లలు మరియు సిబ్బందితో కలిసి వినతిపత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ.. చిట్వేలు గ్రామ పరిధిలోని పిల్లలు పాఠశాలలకు రాకపోకలకు సైకిళ్లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారని.. కానీ ప్రధాన రహదారి ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల తోనూ రద్దీగాను అతివేగ దోరణి ఉండటంతోపాటు ప్రభుత్వ బస్సుల డ్రైవర్లు కూడా అమిత వేగంతో నడుపుతున్నారని ఫలితంగా పిల్లల తల్లిదండ్రులు సైకిళ్ల ప్రయాణానికి విముఖత చూపుతున్నారని పోలీసు వారు కఠినంగా ఆంక్షలు విధించి వాహనాల స్పీడు నియంత్రిస్తే అటు కాలుష్యం ఇటు ప్రమాదాలు తగ్గి అందరూ సురక్షితంగా ఉంటారని, పిల్లలు కూడా సైకిళ్ళను ఉపయోగించడం లో ముందుంటారని తెలిపారు. తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తూ పిల్లల ఆనందానికి తోడ్పడతామని ఎస్సై వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Comments