పల్లె పండుగ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పల్లె పండుగ వారోత్సవాలు ఈనెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నేపథ్యంలో, గ్రామీణ ఉపాధి హామీ పథకము మెటీరియల్ కాంపోనెంట్ క్రింద మంజూరైన పనులలో రాష్ట్రవ్యాప్తంగా 988 కోట్ల రూపాయల నిధులతో మూడు వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు నిర్మాణాలను భూమి పూజ చేయనున్న సందర్భంగా, సోమవారం ఉదయం ప్రొద్దుటూరు మండల పరిధిలోని చౌటపల్లె పంచాయతీ నందు 30 లక్షల రూపాయల అంచనాతో దాదాపు 650 మీటర్ల మేర నూతన సిసి రోడ్డు నిర్మాణానికి ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి భూమి పూజ నిర్వహించారు. పనులలో భాగంగా చౌటపల్లి గ్రామంలోని కెవిఆర్ కాలనీ లోని రామచంద్ర రెడ్డి ఇంటి వద్ద నుండి బాబు ఇంటి వరకు డబ్ల్యు.బి.ఎం గ్రేడ్ 2 మెటల్ రోడ్డును, అలాగే రవి ఇంటి వద్ద నుండి నాగిరెడ్డి ఇంటి వరకు సిమెంటు రోడ్డు నిర్మాణమునకు ప్రతిపాదన చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో చౌటపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ మార్తల ఈశ్వరమ్మ, మార్తల లక్ష్మీరెడ్డి, మార్తల వెంకటరామిరెడ్డి, రమణారెడ్డి, మునివర, గురజాల రామచంద్రారెడ్డి, మురళీధర్ రెడ్డి, హరిబాబు రెడ్డి, నాగార్జున రెడ్డి, దేవిరెడ్డి రమణారెడ్డి, పాతకోట రేవంత్ రెడ్డి, మేకల ఇస్మాయిల్, మేకల సన్న, మేకల రాకేష్, మైఖేల్, కన్నయ్య, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
ความคิดเห็น