పాన్-ఆధార్ లింకింగ్ ఆప్షన్ మారింది
1. పాన్-ఆధార్ లింకింగ్‌లో ఓ ఆప్షన్ మారింది. ఇప్పటివరకు పాన్ కార్డుకు (PAN Card) ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి జూన్ 30 వరకు అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. 2023 మార్చి 31 గా ఉన్న గడువును 2023 జూన్ 30 వరకు పొడిగించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. అయితే పాన్ కార్డ్ హోల్డర్స్ రూ.1,000 జరిమానా చెల్లించి పాన్-ఆధార్ లింక్ (PAN Aadhaar Linking) చేయాల్సి ఉంటుంది.
2. పాన్ కార్డ్ హోల్డర్స్ రూ.1,000 పెనాల్టీ చెల్లించేముందు ఓ మార్పును గుర్తుంచుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ అసెస్‌మెంట్ ఇయర్ ఆప్షన్‌ను మార్చింది. పెనాల్టీ చెల్లించే సమయంలో ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఇది.
3. పాన్ ఆధార్ లింక్ చేయడానికి గతంలో 2023 మార్చి 31 వరకు అవకాశం ఉండేది కాబట్టి అప్పుడు అసెస్‌మెంట్ ఇయర్ 2023-24 ఎంచుకున్నారు. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 ఎంచుకోవాలి. టైప్ ఆఫ్ పేమెంట్‌ను అదర్ రిసిప్ట్స్ (500) అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఈ మార్పు గమనించకుండా పెనాల్టీ చెల్లిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
4. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం పాన్ కార్డ్ హోల్డర్స్ తప్పనిసరిగా తమ పాన్ నెంబర్ లింక్ చేయాలి. మరి మీరు ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో ఎడమవైపు Link Aadhaar పైన క్లిక్ చేయాలి.
5. ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. పేమెంట్ కోసం ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. e-pay Tax పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయాలి.
6. ఆ తర్వాత అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఈ ప్రాసెస్‌తో చలాన్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేసిన 4-5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.
7. ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో ఎడమవైపు Link Aadhaar పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మీ పేమెంట్ డీటెయిల్స్ వెరిఫై అవుతాయి. కంటిన్యూ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి పాన్, ఆధార్ లింక్ చేయొచ్చు.
Comments