4వ వారానికి చేరుకున్న పంచాయతీ పల్లె బాట కార్యక్రమానికి అపూర్వ స్పందన
ఒకటిన్నర సంవత్సరంలో కలిగిన మేలును ఇంటింటా ప్రజలకు వివరించిన కొత్తపల్లె సర్పంచ్ కొని రెడ్డి శివచంద్ర రెడ్ట్
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు
ఇక ముందు కూడా ఇదే తరహాలో మంచి చేస్తామని హామీ
జగన్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని ప్రజల ఆశీర్వాదం
ఇంతగా లబ్ధి ఇదివరకెన్నడూ లేదన్న అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లు
జగన్ ప్రభుత్వ పాలనలో పంచాయతీలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని, ప్రత్యేకించి అతి పెద్ద పంచాయతీ అయిన కొత్తపల్లి పంచాయతీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో తాము ఎల్లవేళలా కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే పంచాయతీ పరిధిలోని అమృత నగర్, కొత్తపల్లి, రాజేశ్వర్ కాలనీ, ప్రకాష్ నగర్ లాంటి ప్రాంతాల్లో రోడ్లు కాలువల నిర్మాణం చేపట్టి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూసుకోవడంలో తాను తన పంచాయతీ వార్డు మెంబర్లు ఎల్లవేళలా కృషి చేస్తూ ప్రజా సమస్యలే తమ సమస్యలుగా భావిస్తూ, నేటికీ పూర్తికాని పనులను పూర్తి చేయాలనే తలంపుతో ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రతి ఆదివారం పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలలో పంచాయతీ పల్లె బాట కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువవుతున్న కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి.
కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం నిర్వహించే పంచాయతీ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా, పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీ వాసులు, కొనిరెడ్డి అభిమానులు, వైయస్సార్సీపి కార్యకర్తలు ఆయనకు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు, ప్రజా సమస్యల పై పై దృష్టి సారించటమే వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అని ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రతి ఆదివారం తన పంచాయతీ పరిధిలో పంచాయతీ పల్లె పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ప్రజలు తనను అడిగిన ప్రశ్నలకు లేదా ప్రజలు తెలిపిన సమస్యలకు పరిష్కార దిశగా తాను అడుగులు వేస్తూ పంచాయితీని దినదినాభివృద్ధి చెందేలా మౌలిక వసతులతో పంచాయితీ అభివృద్ధి పథంలో నడవాలని ఇందుకుగాను తాను తన వార్డు మెంబర్లు ఎల్లవేళలా కృషి చేస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్యమ్మ,3వ వార్డ్ మెంబెర్ కొనిరెడ్డి రమణ రెడ్డి,16వ వార్డ్ మెంబర్ బందెల మోష, 19వ వార్డ్ మెంబెర్ నందిరెడ్డి తిరుపాల్రెడ్డి, వైసిపి నాయకులు పొట్టు లక్ష్మిరెడ్డి, సుమంతు, హసీనా, వైసిపి కార్యకర్తలు కొనిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.
Comments