వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మరియు గామీణాభివృధి శాఖ శిక్షణ సంస్థ, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం, వై.ఎస్.ఆర్ కడప జిల్లా వారు నేటి నుండి 23వ తేదీ వరకు అనగా రెండు రోజులు జిల్లాలో కొత్తగా ఎన్నిక అయిన మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల మరియు కో-ఆప్షన్ సభ్యులకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గామీణాభివృధి మరియు పంచాయతీరాజ్ శిక్షణా సంస్థ సౌజన్యంతో జిల్లా వనరుల కేంద్రం, కడప ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ విధులు, బాధ్యతలు, పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ శిక్షణా కార్య్రక్రమం ద్వారా నూతనముగా ఎన్నికయిన వారికి తెలియచేయనున్నారు. శిక్షణా తరగతుల అనంతరం మండల అభివృద్ధికి దోహదపడతారని సంస్థ ఆశిస్తోంది. జిల్లా వ్యాప్తంగా నూతనముగా ఎన్నిక అయిన మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల మరియు కో-ఆప్షన్ సభ్యులకు ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యారు.
top of page
bottom of page
Comments