అక్రమ కేసులు పెడితే సహించేది లేదు.
---పంతగాని నరసింహ ప్రసాద్.
టిడిపి నాయకులు కార్యకర్తలపై అధికారులు అక్రమ కేసు బణాయిస్తే సహించేది లేదని టిడిపి రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ అన్నారు.
మీడియాతో మాట్లాడుతున్న పంతగాని
బుధవారం చిట్వేలి మండల పరిధిలోని తిమ్మయ్య గారి పల్లి గ్రామంలో ఇరువర్గాల మధ్య భూ సమస్యపై తలెత్తిన వివాదంలో టిడిపి వర్గంపై రెవెన్యూ అధికారులు బైండోవర్ కేసులు నమోదు చేయడం ను ఖండించారు. మిగిలిన వైసిపి వర్గం వారిని చూసి చూడనట్లు వ్యవరించడం ముమ్మాటికీ కక్షపూరిత చర్యని తాను అన్నారు. మహిళలపై కూడా కేసుల బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విధమైన చర్యలు వివాదాన్ని మరింత జటిలం చేస్తాయని అధికారులు గమనించాలన్నారు. గ్రామ పరిధిలో మాట్లాడుకుంటే పోయే సమస్యను అధికారులు భూతద్దంలో చూపి ఏకపక్షంగా వ్యవహరించడం తగదని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని తాసిల్దార్ ను కోరారు. వైసీపీ వర్గం అధికారం ఉన్నదని టిడిపి వర్గం వారిని అణచివేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఎమ్మార్వో శిరీష వివరణ:----నిషేధిత భూములను ఆక్రమించే వారిపై మండల వ్యాప్తంగా బైండోవర్ కేసులు చేపడుతున్నామని చట్ట ప్రకారమే వ్యవహరించాము తప్ప మాకు ఎవరిమీద కక్ష లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కాకర్ల లారీ సుబ్బరాయుడు,బాలు రామాంజులనాయుడు, కాకర్ల నాగార్జున,బాదిత కుటుంబ సభ్యులు కాటూరి నరసింహులు వెంకటరమణ, టిడిపి నాయకులు బొక్కసం సునీల్, జనసేన నాయకులు మాదాసు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Comments