2024 ఎన్నికలలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...
0%YES - సమర్ధిస్తున్నాను
0%NO - సమర్థించను
2024 ఎన్నికలలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి: పవన్ కళ్యాణ్
2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసే జనసేన వెళ్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి నారా లోకేష్ తో కలిసి మీడియాతో మాట్లాడుతు, రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమతో పాటు బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. ఏపీలో అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు సంఘీభావం చెప్పేందుకే వచ్చానన్నారు.
టీడీపీతో కలిసి పనిచేయాలని ఇప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు.బ్యాంకులో సిబ్బంది చేసిన తప్పునకు బ్యాంకు మేనేజర్‌ని తప్పుబడుతామా ? ప్రతి విషయాన్ని సీఎంకి లిక్ చేస్తామా. గతంలో దీన్ని గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా అమలు చేశారు. హైదరాబాద్ సంపూర్ణమైన సిటీ నిర్మించిన వ్యక్తికి 300 కోట్ల రూపాయల స్కామ్‌ను చుట్టి ఇలా జైల్లో పెట్టడం బాధకలిగించిందన్నారు. తీవ్రమైన నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇతరులపై నేరాలు మోపుతూ జైల్లో పెడుతున్నారన్నారు.
తాను తీసుకునే నిర్ణయాలు చాలా మందికి బాధ కలిగిస్తాయన్నారు. 2014లో కూడా ఇలాంటివి విన్నానన్నారు. దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే మోడీకి అప్పట్లో మద్దతు తెలిపాను. 2019లో పాలసీ విధానంతోనే చంద్రబాబుతో విభేదించాను. తాను ఓ నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడనన్నారు. సీఎం జగన్ అవినీతి తిమింగళం అని.. ఆయన ఇతరులపై అవినీతి కేసులు మోపడం ఏంటీ అని పవన్ కళ్యాణ్ అడిగారు. జగన్ కు మిగిలింది ఆరు నెలలే అన్నారు. లిక్కర్ పాలసీలో 1/3 వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతుందని ఆరోపించారు.
డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోవడం లేదని.. డైరెక్ట్ క్యాష్ అడగడంలో ఆంతర్యం ఏంటీ అని మండిపడ్డారు. రోడ్లు వేయవు, బెదిరిస్తావు.. అని సీఎం జగన్‌పై పవన్ విరుచుకుపడ్డారు.భూ కబ్జాలు జరుగుతున్న ఒక్కరిపై కేసు ఫైల్ చేయడం లేదని మండిపడ్డారు.
Comments