విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలి. పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ రాజశేఖర్... రాష్ట్రంలో నెలకొని ఉన్న విద్యా రంగ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్ అన్నారు.... బుధవారం నాడు శ్రీకాళహస్తిలో నీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన పిడిఎస్యు జిల్లా3 వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు... ఈ సభకు జిల్లా కార్యదర్శి ఎస్ జాకీర్ అధ్యక్షత వహించారు.... రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటు కార్పొరేటీకరణ గా మార్చివేసిందాన్నారు... నూతన జాతీయ విద్యా విధానం 2020 పేరుతో విద్యను కాషాయీకరణ వైపు తీసుకెళ్తున్నారు.. రాష్ట్రంలో 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే భర్తీ చేయటం లేదన్నారు.. అమ్మ ఒడి జగనన్న విద్య దీవెన జగనన్న వసతి దీవెన లకు వివిధ రకాల ఆంక్షలు పెట్టి విద్యార్థులకు ఆ పథకాలను దూరం చేస్తున్నారు... ప్రభుత్వ కళాశాలలో వందలాది లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయటం లేదన్నారు..... ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నారు.... తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.... అనంతరం పిడిఎస్యు చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని 13 మందితో ఎన్నుకున్నారు.... అధ్యక్షులుగా... K. ప్రదీప్, కార్యదర్శిగా S.జాకీర్, కోశాధికారిగా హేమంత్ తో పాటు 11 మంది సభ్యులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.... ఈ కార్యక్రమంలో IFTU జిల్లా కార్యదర్శి K.రమేష్, పిడిఎస్యు నాయకులు సాయి, విక్కీ, హరీష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comentários