వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పధకాల అమలు తీరు?
అభినందనీయం
కొందరికే సంక్షేమ పధకాలు అందుతున్నాయి
ప్రతి గడప నందు సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు, మున్సిపల్ పరిధిలోని 24 వ వార్డులో గడపకు గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 59వ రోజు కొనసాగింపుగా ఆయన పర్యటించి జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల్లోని పథకాలు లబ్ధి పొంది న ప్రజలతో మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో అర్హులైన వారికి పొందని పక్షము లో సంబంధిత 9 శాఖలు కలిగిన అధికారులతో అక్కడికక్కడే పరిష్కరించి మరొకమారు ఈ ప్రజా ప్రభుత్వాన్ని సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ప్రొద్దుటూరుకు శాసనసభ్యునీగా నాకు అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరారు.
ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్క ప్రాణము ఎంతో ముఖ్యం: ఎమ్మెల్యే రాచమల్లు దేశవ్యాప్తంగా గత రెండు సంవత్సరాలుగా కరోనా ఎంతటి తీవ్ర సంక్షోభానికి గురిచేసిందో మనందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా ఎందరో ప్రజల ప్రాణాలను, మన ఆత్మీయులను ట, మన కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఆ సమయంలో కరోనా ఫ్రంట్ వారియర్స్ గా నిలిచింది మన వాలంటరీ వ్యవస్థనే అని ఇంకా దేశవ్యాప్తంగా టీకాలు ఇవ్వడంలో మన రాష్ట్రం ప్రప్రదంలో నిలిచిందని అందుకు ముఖ్య కారణం వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అవి తీసుకొచ్చిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డిని, ప్రతి ఒక్క ప్రాణి విలువ ఎంతో విలువైనదిగా భావించినందుకే ప్రాణ నష్టం తగ్గించగలిగామని, అందరికీ టీకాలు ఇవ్వగలిగామని ఆయన తెలియజేస్తూ ఇదే కాకుండా ఆరోగ్యశ్రీలో 1000 రూపాయలు దాటితే ఆ పైన ఎంతైనా గాని ప్రభుత్వమే భరిస్తుందని ఇటువంటి సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడ లేనటువంటి ఒక మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని అందుకు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృషివల్లే అని ఆయన తెలియజేశారు, మరొకసారి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ కమల్ భాష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు,కౌన్సిలర్లు వరుకూటి ఓబుల్ రెడ్డి, ఇర్ఫాన్ భాషా, సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి శివాలయం చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రస పుత్ర రజిని, పిట్ట బాలాజీ, బొల్లవరం శేఖర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి,మహిళలు, ముస్లిం నాయకులు మహిళలు, వార్డు ప్రజలు , సచివాలయ సిబ్బంది , వాలెంటర్ల్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments