ముగిసిన ప్రొద్దుటూరు పురపాలక సంఘ సాధారణ సమావేశం
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పురపాలక సంఘ సాధారణ సమావేశం శనివారం ఉదయం మునిసిపల్ కౌన్సిల్ సమావేశ భవనం నందు ఏర్పాటు చేశారు. సమావేశానికి మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు అధ్యక్షత వహించగా మునిసిపల్ వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు. అసమ్మతి బూనిన పలువురు వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాగా పోలీసుల భారీ బందోబస్తు మధ్య సమావేశం ముగిసింది. సమావేశ భవనంలోకి పాత్రికేయులకు అనుమతి నిరాకరించిన పోలీసులు, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జోక్యంతో అనుమతి లభించింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభించి అజెండాలోని పలు అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం, అజెండాలోని అరవై అంశాలను ఆమోదించినట్లు ప్రకటించిన చైర్మన్ భీమునిపల్లి లక్షిదేవి.
టేబుల్ అజెండాలో పదిహేడు అంశాలు పొందుపరచగా, అందులో పనుల ఉత్తర్వులు మంజూరు చేయుట, టెండర్ల ఆమోదం, అంచనాల ఆమోదం, పరిపాలనా అనుమతులు, పదిహేనవ ఆర్ధిక సంఘ నిధుల యొక్క వార్షిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పట్టణ సేవలు మెరుగుపరచుటకు పురపాలక వార్షిక అభివృద్ధి ప్రణాళిక రూపొందించి 26.10.2022 నాడు సి&డిఎంఏ, ఏపీ, గుంటూరు వారికి ప్రయారిటీ ప్రకారం యాన్యువల్ డెవలప్మెంట్ ప్లాన్ నందు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, కమ్యూనిటీ టాయిలెట్లకు నీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ డ్రైనేజీలు, సీసీ/బీటీ రోడ్లు, స్లాటర్ హౌస్‌ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, ఖాళీ స్థలాల రక్షణ సంరక్షణ, శ్మశాన వాటికలు, మున్సిపల్ పాఠశాలలకు మరమ్మత్తులు తదితర అంశాలను సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మెన్ పాతకోట బంగారు మునిరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు చెందిన వ్యక్తిగా సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రొద్దుటూరుకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నారని, అయిదు వందల ఇరవై కోట్ల రూపాయలతో రాబోవు రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నామని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేసారు.
Comentarios