సంక్షేమం పేరుతో ప్రజల పై భారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వం - రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు - టిడిపి నాయకుల ఆగ్రహం.
ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ మహిళ అధ్యక్షురాలు బాగాల లక్ష్మీదేవి గారి ఆధ్యర్యంలో రాష్ట్ర ప్రజలపై సంక్షేమ పథకాల పేరుతో ఇంటి పన్ను, విద్యుత్ చార్జీలు, చివరకు చెత్త పన్నులు వసూలు చేస్తూ ప్రజలపై భారం మోపుతున్న జగన్ ప్రభుత్వానికి ఇది తగదని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం మున్సిపల్ పరిధిలోని 29, 30 వార్డులలో జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షులు ఇవి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకి జగన్ ప్రభుత్వం లో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని వారికి రక్షణ కల్పించే నాథుడే కరువయ్యారు అన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పుకుంటున్న ప్రభుత్వం రాష్ట్రంలో జరిగే అరాచకాలపై అరికట్టడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా పలు నిత్యావసర వస్తువులపై అధిక ధరలను పెంచి పేద ప్రజల నడ్డి విరగ్గొడుతూ అధికార పక్షం సమర్థించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక చెత్త పన్నులే కాకుండా ఇంటి పన్నులు, విద్యుత్ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయిన సంగతి అధికార పక్షానికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వైసీపీ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు రోజుకు ఒక రూపాయి, రెండు రూపాయలు చెల్లించ లేరా అని ప్రజలను వైసిపి నాయకులు ప్రశ్నించడం శోచనీయమన్నారు . ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని గత టీడీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన జగన్ నేడు చేస్తున్నదేమిటి అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బి.సి. సెల్ కార్యదర్శి తాటి శ్రీను, ప్రొద్దుటూరు మండల ఉపాధ్యక్షుడు షరీఫ్ కవి, 8వ వార్డ్ ఇంఛార్జి చెన్నయ్య, లిగేందిన్నే లక్ష్మీదేవి మరియు పెద్ద ఎత్తున వార్డు మహిళలు,ప్రజలు పాల్గొన్నారు.
Comments