ఘనంగా వైఎస్సార్ 13వ వర్ధంతి
పెదగంట్యాడ, GVMC పరిధిలోని 76 వార్డు నడుపూరు గాంధీ విగ్రహం వద్ద ఆ వార్డు వైసీపీ ఇంచార్జ్, శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ దొడ్డి రమణ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక వైసీపీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన దొడ్డి రమణ. అనంతరం మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో తీసుకొని రావటానికి శాయశక్తులా కృషి చేసి అభివృద్ధి పథంలో నడిపించే వాడని, రైతులకు అండగా నిలిచి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు లబ్ధి చేకూర్చేలా చూశారని, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరు కు వైద్యం అందేలా చూశారని, ప్రాజెక్టును ఏర్పాటు చేసి నీటిని వృధా చేయకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులకు పంటలకు నీరు అందజేయటం ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానేత అని, జిల్లాల పట్టణాల గ్రామాలకు త్రాగునీరు అందించడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, 108 వాహనాలను ప్రజల అవసరాలకు ఏర్పాటు చేసిన మహనీయుడు అని కొనియాడారు.
అనంతరం పేదవారికీ పండ్లు పంపిణి కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు తాటి కొండ జగదీష్ , తాటికొండ ఆచ్చుత్, అనపర్తి రమణ, కాకినాడ పెంటరావు, అండిబోయిన సన్నీ, పరంకూసం ప్రమీల, నర్సింగరావు, గాలి బాబురావు, దొడ్డి రామ క్రిష్ణ, దేనిశేట్టి చిన్నారావు, గొంప రమేష్, గురుమూర్తి, ఎం. మూర్తి, పల్లం నరసింగరావు, పాముల వెంకట అప్పారావు, మీసాల ఉమా శంకర్, నడుపురు శ్రవణ్ కుమార్, పరమేష్, అంజి, తాతాజీ, రమణ, ములకలపల్లి ప్రసాద్, వంజ్రపు గణేష్, పత్రీ దేవి, మంగ, గొంప రామజ్యోతి, దొంప ప్రసాద్ , గణేష్, శరత్ కుమార్, ధనలక్ష్మి, ఎందవ రమేష్, అత్చుట్ తదితరులు పాల్గొన్నారు.
Comments