కిడ్నీల ఇన్ఫెక్షన్ తో నెల్లూరు అపోలో ఆస్పత్రి లో చికిత్స, దాతల కోసం ఎదురు చూపు. మండల వ్యాప్తంగా సాయం అందిస్తున్న దాతలు. మీరు దాతలలో ఒకరు కాగలరని ఆశిస్తున్నారు పెంచలయ్య కుటుంబ సభ్యులు.
తాను ఒక నిరుపేద. తాను ఆటో నడిపితే కానీ తన భార్యా పిల్లల జీవనం గడపాలి. అలా సాగుతున్న వారి జీవితం కిడ్నీల ఇన్ఫెక్షన్ రూపంలో జబ్బు చేసి ఆసుపత్రి పాలై సుమారు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్ల అనడంతో చేసేది ఏమీ లేక దాతల సాయం కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ భార్య తమ చంటి బిడ్డ తో కలిసి నెల్లూరు పట్టణంలోని అపోలో ప్రైవేటు ఆస్పత్రిలో ఎదురు చూస్తున్నారు.
వివరాల్లోకెళితే చిట్వేలి మండల పరిధిలోని రాజుకుంట గ్రామపంచాయతీ పాత అనుంపల్లి గ్రామంలో మల్లికా పెంచలనర్సయ్య వయస్సు 23 సంవత్సరాలు.. తాను ఆటో నడుపుకుంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లగా క్రియాటిన్ మరియు కిడ్నీల సమస్య ఉన్నదని.. రక్తాన్ని శుద్ధి చేస్తూ వైద్యం చేయాలని.. సుమారు ఆరు లక్షల ఖర్చవుతుందని నెల్లూరు అపోలో ఆసుపత్రి వారు నిర్ధారించి ప్రస్తుతం ఐసియు నందు ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు..దాతలు ఎవరైనా సహాయం చేయక పోతారా నా ప్రాణం నిలువక పోతుందా..!! అంటూ సంబంధిత వ్యక్తి, కుటుంబ సభ్యులు దైవాన్ని తలుస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా విషయం తెలిసిన కొంత మంది ప్రతినిధులు, సేవా సంస్థల సభ్యులు, వ్యక్తులు, తమ శక్తి కొలది బాధితులకు సహాయం అందించేందుకు నడుంబిగించారు.
బాధితుని ఫోన్ పే నెంబర్: 9573798964.(జలకం హరికృష్ణ) బంధువు పేరుతో ఉంటుంది.
మానవ సేవే మాధవ సేవ తలంపుతో.. అందరూ సహాయం అందిస్తే పెంచలనరసయ్య తిరిగి సంపూర్ణ ఆరోగ్యం పొందడం తద్యం.
Comments