శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం నందు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ మరియు నూతనంగా లబ్ధిదారులకు మంజూరైన పెన్షన్ పత్రాలను అందజేసిన తొట్టంబేడు మండల ఇంచార్జ్ శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు గారు.అనంతరం పింఛనుదారులందరికీ శుభాభినందనలు తెలియజేశారు. పవిత్ర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అవ్వా తాతలు, పేదలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ‘ప్రజా సంకల్పయాత్ర’లో చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవ్వ తాత వికలాంగులు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారి తొలి సంతకం ‘నవరత్నాల’లో అత్యంత ప్రాధాన్యమైన వైఎస్సార్ పింఛను పథకంలో భాగంగా పింఛన్ల పెంపుకు నిర్ణయం తీసుకున్నారని. పింఛను మొత్తం రూ.2,000 నుంచి రూ.3000 వరకు పెంచుకుంటూ పోతాం అని చెప్పిన ముఖ్యమంత్రివర్యులు, ఆ మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రూ.2,250కి పెంచుతూ తొలి సంతకం చేశరని. కొత్త ఏడాదిలో పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంచి గిఫ్టు ఇచ్చారని ప్రస్తుతం ఉన్న 2 వేల 250 రూపాయల పెన్షన్‌ను 2 వేల 500లకు పెంచారని. గతంలో దశలవారీగా పెన్షన్లను పెంచుతామని జగన్ గారు హామీ ఇచ్చారని. అందులో భాగంగా పెన్షన్‌దారులున్నారులకు నేటి నుంచి 2 వేల 500 రూపాయల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు. పింఛన్ దారులకు ఇంత లబ్ధిని చేకూరుస్తున్నా ముఖ్యమంత్రివర్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల వైస్సార్సీపీ నాయకులు, మండల అధికారులు మరియు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comentários