పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
తెల్లవారుజాము నుండి రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 64,61,485 మంది లబ్ధిదారులకు 2729.86 కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఉదయం 10 గంటల సమయం వరకు దాదాపు 85 శాతం పెన్షన్లు పంపిణీ చేపట్టిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. ఇందులో భాగంగా పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృత నగర్, ఖాతారాబాద్ గ్రామంలోని రామాలయం వద్ద ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అలాగే కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, తాము ఇచ్చిన హామీలలో ఒకటి అయిన పెన్షన్ల పెంపుదల చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని, సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావటం చేత ఆగస్టు 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. పెన్షన్ల పంపిణీలు టాప్ త్రీ లో నిలిచిన శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు, ప్రస్తుతానికి చివరి స్థానంలో అల్లూరి జిల్లా, జోరు వానలోను ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్న సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు. కార్యక్రమంలో కొత్తపల్లి పంచాయతీ సెక్రెటరీ నరసింహులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ సుబ్బారెడ్డి, సుంకర వేణు, నాగేష్, 13వ వార్డు మెంబర్ హర్షవర్ధన్ రెడ్డి, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Comments