తగ్గని ఎండలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు
జూన్ నెల మూడో వారంలో కూడా ఎండ వేడిమి
రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 264 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 42 మండలాల్లో తీవ్రవడగాల్పులు,203 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
శుక్రవారం కాకినాడ జిల్లా సామర్లకోటలో 46.8°C, విజయనగరం జిల్లా కంతకపల్లె,తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 46.3°C, అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో 46.1°C, మన్యం జిల్లా కురుపాం, అప్పయ్యపేటలో 45.6°C, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 45.3°C, కోనసీమ జిల్లా మండపేట,ఈతకోటలో 45°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 370 మండలాల్లో తీవ్రవడగాల్పులు,132 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపుఅక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
YouTube లో సగం దరిద్రం పోయింది