top of page
Writer's picturePRASANNA ANDHRA

మళ్ళి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

పెట్రోల్ , డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు(Crude Companies) మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 3 ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఆదివారం రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు, డీజిల్ ధర 85 పైసలు పెరిగింది. ఇంధన ధరల తాజా పెరుగుదల తర్వాత, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.41కి, డీజిల్ లీటరుకు రూ.94.67కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 118.41, డీజిల్ రూ. 102.64. చేరుకుంది. గత 13 రోజుల్లో 11వసారి చమురు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి.

నవంబర్ 4, 2021 నుంచి చమురు ధరలు దేశవ్యాప్తంగా స్థిరీకరించారు. దాదాపు ఒకటిన్నర నెలల తర్వాత అంటే మార్చి 22న మొదటిసారిగా ధరలు పెంచారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 3 వరకు 13 రోజుల్లో 11 సార్లు చమురు ధరలు పెరిగాయి. గత 13 రోజుల్లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.8 పెరిగింది. మార్చి 21, 2022 వరకు ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.95.41 ఉండగా ప్రస్తుతం లీటరుకు రూ.103.41కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 75 పైసలు చొప్పున పెరిగాయి. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.108.96, డీజిల్ లీటరుకు రూ.99.04 పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..


విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.118.15కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.50లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.117.62ఉండగా.. డీజిల్ ధర రూ. 104.06గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.22లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.104.70గా ఉంది.


17 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page