వికలాంగురాలిపై అర్థరాత్రి విచక్షణారహితంగా దాడి.. కేసు నమోదు.. బాడీ బిల్డర్ వెట్టి శివాజీ అరెస్ట్
తాను జాతీయ స్థాయి బాడీబిల్డర్ అనే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వెట్టి శివాజీ వికలాంగురాలు అనే దయ మానవత్వం కూడా లేకుండా విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలు కథనం మేరకు.. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అక్కిసంపాలెంనకు చెందిన చెంగమ్మ అనే వికలాంగురాలు వివాహం కాకపోవడంతో తన చెల్లెలు, సోదరుడు హరిగోపాల్ వద్ద నివాసం ఉంటోంది.
ఈనెల 18వ తేదీన అర్థరాత్రి సుమారు 12గంటలకు అందరూ నిద్రిస్తున్న సమయంలో బాడీ బిల్డర్ వెట్టిశివాజీ హరికి చెందిన బైకును ధ్వంసం చేయడంతో, ఆ చప్పుడు విని వికలాంగురాలు చెంగమ్మ గ్రామస్తులతో కలిసి తన సోదరుడు హరిగోపాల్ ఇంటికి వెళ్లి చూడగా హరిగోపాల్ ఇంటికి బయట గెడి వేసి ఉన్నాడు. ఇంతలో ఆమె తన సోదరుడిని కాపాడుకోవడానికి రక్షించాలి అని కేకలు వేయగా.. ఇంతలో అక్కడికి ఇనుప రాడ్డు చేతిలో పెట్టుకుని వచ్చిన వెట్టి శివాజీ కనీస దయ మానవత్వం లేకుండా వికలాంగురాలైన చెంగమ్మను విచక్షణారహితంగా దాడి చేయడంతో తలపై బలమైన గాయం ఏర్పడటమే కాకుండా తన అవిటి చేయిని కూడా విరిచేయడంతో ఆమె చేయి విరిగిపోయింది. ఈ దాడిలో వెట్టి శివాజీ తోపాటు అతని కుటుంబసభ్యులు కాటమ్మ దిలీప్ యశోదమ్మ సుజాతమ్మ కర్రెమ్మ పవిత్ర అందరూ ఉమ్మడిగా దాడిలో పాల్గొనట్లు బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.
వెట్టి శివాజీ అరెస్ట్ లో ట్విస్ట్..పరారీ కోసం యత్నం.. చేదించిన పోలీసులు
ఈ కేసులో ఎస్సై హనుమంతప్ప శుక్రవారం నిందితుడు వెట్టిశివాజీని అరెస్ట్ చేయగా , పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరారీ తో తప్పించుకునేందుకు యత్నించగా పోలీసులు చాకచక్యంగా అతడ్ని పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. నిందితునికి రిమాండ్ విధించారు
వెట్టి శివాజీ ఆగడాల నుంచి మా గ్రామాన్ని కాపాడండి
గ్రామంలో వెట్టి శివాజీ తాను బాడీ బిల్డర్ అనే గర్వంతో విర్రవీగుతూ గ్రామస్తులపై దౌర్జన్యాలు చేస్తున్నాడని, అతని వల్ల తాము భయాందోళనతో ప్రాణభయంతో బతుకుతున్నామని అతని నుంచి తమకు రక్షణ కల్పించాలని అక్కిసంపాలెం గ్రామస్తులు పోలీసులకు పిర్యాదు చేశారు.
Comments