ఏప్రిల్ ఫూల్ కాదు... ఏప్రిల్ కూల్
సి హెచ్ ఎస్ ఆధ్వర్యంలో చెట్ల పెంపకం పై వినూత్న కార్యక్రమం.
ఏప్రిల్ ఫస్ట్ రోజున ఏవో అపద్దపు మాటలు చెప్పి ఏప్రిల్ ఫూల్ అనకుండా.. చెట్ల ఆవశ్యకతను తెలుపుతూ స్కూల్ పిల్లలచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ చొరవతో శ్రీ పద్మావతి హై స్కూల్ ఆధ్వర్యంలో చిట్వేల్ ఫిట్నెస్ జిమ్ వ్యాయామకారులతో సంయుక్తంగా వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, సామజిక సేవల గురించి వివరించి వారిచే మొక్కలు నాటించారు.
తర్వాత ఖర్బుజా కాయ పోషక విలువలు తెలిచేస్తూ అందరికి ఖర్బుజాను పంపిణి చేసారు. వృక్షో రక్షిత రక్షితః , ఏప్రిల్ కూల్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో చిట్వేల్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు , చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ ప్రతినిధి ఇంతియాజ్ అహ్మద్ , శ్రీ పద్మావతి స్కూల్ కరస్పాండెంట్ నరేష్ బాబు, హెడ్ మాస్టర్ బాబు ,వారి సిబ్బంది, ఫిట్నెస్ జిమ్ కోచ్ బాలు నాగేశ్వర్ , వ్యాయమ కారులు నరసింహ ,రహీమ్ , కరీం , కోసంగి రాజా , కామిశెట్టి చరణ్ , వల్లంకొండు సత్యం , వల్లెపు శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments